గోన్ గోప్పుల గ్రామం లో నవజాత శిశువుల మరియు పిల్లల ఉచిత వైద్య శిబిరం
సోమవారం : 04/05/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్
నవజాత శిశువుల మరియు పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున గోన్ గోప్పుల గ్రామ సర్పంచ్ మరియు వీడీసీ వారి సహకారంతో ఉచిత క్యాంప్ నిర్వహించి 110 మంది పిల్లలను ఉచితంగా పరీక్షించడమే కాకుండా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది మేము మా నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున ఇది 12వ ఉచిత వైద్య శిబిరం అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం ఇప్పటివరకు 1050 మంది పిల్లలకు ఉచిత వైద్యము ఉచిత మందుల పంపిణీ చేసినందుకు సంతోషించుచున్నాము ఇట్టి కార్యక్రమాలను ఆయా గ్రామాల సర్పంచులు మరియు విడిసి వారు సహకరించినందుకు వారికి హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.























