ఒక పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి అందరం సహకరిద్దాం
త్రిశూల్ న్యూస్ డిచ్ పల్లి మండల్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించి 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏడ్ల ప్రవళిక మాట్లాడుతూ, పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేష్, ఆరోగ్య సిబ్బంది భానుబీ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

























