ధర్పల్లిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం…
ఆదివారం : 28/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, జూన్ 29 నుంచి ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని మిగిలిన పిల్లలకు టీకాలు అందజేస్తామని తెలిపారు.
0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి గతంలో పోలియో టీకాలు వేసినా కూడా ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























