చిరునామా లేని బస్సు స్టాండ్లు.. ప్రయాణికుల ఇబ్బందులు…
త్రిశూల్ న్యూస్ డిచ్ పల్లి మండల్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, నందిపేట్ బస్సు స్టాండ్లలో పేర్లు లేదా గుర్తింపు బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా డిచ్‌పల్లి మండలంలో తెలంగాణ యూనివర్సిటీ ఉండటంతో ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే బస్సు స్టాండ్ వద్ద స్పష్టమైన పేరు లేదా సూచిక బోర్డు లేకపోవడంతో సరైన ప్రదేశాన్ని గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యపై పలువురు ప్రయాణికులు స్పందిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అన్ని బస్సు స్టాండ్లలో స్పష్టమైన పేర్లు, దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీంతో ప్రయాణికులకు సౌలభ్యం కలగడంతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఇబ్బందులు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

























