నందిపేట్ లో అక్రమ ఇసుక – కేసు నమోదు చేసిన పోలీసులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్ 28 త్రిశూల్ న్యూస్ : నందిపేట మండల కేంద్రంలో అక్రమ ఇసుక దందా చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ… నమ్మదగిన సమాచారం మేరకు నందిపేట మండల కేంద్ర పల్గుట్ట ప్రాంతంలోని బంగారు ఇరిగేషన్ పక్కన గల పోశెట్టి ఇసుక కంకర దుకాణంలో మహారాష్ట్ర నుండి ఎమ్ హెచ్ 40 సీఎం1640 లారీ లో అక్రమంగా ఇసుకను దింపుతుండగా పట్టుకోవడం జరిగిందని, లారీ తో పాటు ఇసుకను అన్లోడ్ చేసే హిటాచి జెసిబిని, ట్రాలీ ని సీజ్ చేసి అక్రమ రవాణాకు పాల్పడిన లారీ డ్రైవర్ మరోతిరాం చంద్ర పిట్లేవాడ్, లారీ ఓనర్ గజానన్ లక్ష్మణ్ రావు, ఇసుకను దించుకుంటున్న తల్వేద పోశెట్టి పైన కేసులు నమోదు చేయడం జరిగిందనిఐ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఎస్కే కాదు, అక్రమంగా సంబంధిత పత్రాలు లేకుండా ఏ వాహనాలైనా, వ్యాపారమైన ఎవరైనా చేసిన తప్పకుండ కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ హెచ్చరించారు.























