లింగాపూర్ బ్రిడ్జి 25 రోజుల పాటు మూసివేత
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని లింగాపూర్ బ్రిడ్జిని మరమ్మతుల పనుల దృష్ట్యా జూలై 2 నుంచి 25 రోజుల పాటు మూసివేస్తున్నట్లు సివిల్ కాంట్రాక్టర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇందల్వాయి నుంచి ధర్పల్లి వెళ్లే వాహనదారులు రాంపూర్, లోలం, ఎల్లారెడ్డిపల్లి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని సూచించారు.
బ్రిడ్జి మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు, వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు కోరారు. కాగా, ఈ మార్గంలో ప్రయాణించే వారు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

























