భీంగల్ ఊర పండుగకు రూ.1 లక్ష విరాళం అందించిన ఈరవత్రి అనిల్ కుమార్…
గురువారం : 02/07/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ పట్టణంలో నిర్వహించనున్న ఊర పండుగ సందర్భంగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవా దృక్పథంతో పండుగ నిర్వహణకు సహకరించిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విరాళం విజయవంతమైన ఉత్సవాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని కమిటీ పేర్కొంది.
– సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ, భీంగల్

























