తాసిల్దార్ పర్యవేక్షణ లో ఎస్ఐఆర్ నమోదు వేగవంతం చేశారు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ అంబాటి చంద్రశేఖర్
త్రిశూల్ న్యూస్, జులై 7 : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రం పద్మశాలి సంఘంలో బి ఎల్ ఓ బూతులను ఏర్పాటు చేసి తాసిల్దార్ చిలుక కృష్ణ పర్యవేక్షణ లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేశారు,ప్రత్యేక చర్యలు చేపట్టి,ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత బి ఎల్ ఓ లకు, అధికారులకు ఆదేశించారు.
ప్రతి అర్హుడి ఫారం నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ పెంచాలని, ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు, మోర్తాడ్ మండల పంచాయతీ అధికారి శివ చరణ్ , బి ఎల్ ఓ లను , ఎన్యుమరేషన్ ఫారాల నమోదు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, గ్రామపంచయతీ సిబ్బంది బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు

























