SIR ఫారాలను తప్పనిసరిగా నింపి సమర్పించాలి.పిప్రీ సర్పంచ్ అరిగెల జనార్ధన్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ SIR కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పిప్రి గ్రామంలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి జితేందర్ పాల్గొని గ్రామస్తులకు సర్ ప్రక్రియపై వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అరిగెల జనార్ధన్ మాట్లాడుతూ…..SIR ఫారం అందుకున్న ప్రతి అర్హ ఓటరు తప్పనిసరిగా ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సంబంధిత అధికారులకు నిర్ణీత గడువులోగా సమర్పించాలని కోరారు. ఫారం సమర్పించకపోతే ఓటరు జాబితాలో పేరు కొనసాగడంపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.
ఫారం నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అక్కడ అధికారులు, సిబ్బంది అవసరమైన సహాయం అందిస్తారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ ఓటరు తన హక్కును పరిరక్షించుకునేందుకు SIR ప్రక్రియను విజయవంతం చేయాలని సర్పంచ్, కార్యదర్శి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

























