డ్రంక్ అండ్ డ్రైవ్: ముగ్గురికి మూడు రోజుల జైలు శిక్ష – ఎస్సై తిరుపతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి ఆర్మూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి (సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్) మూడు రోజుల జైలు శిక్ష విధించారు.
అదే కేసులో మరో నలుగురికి కోర్టు జరిమానా విధించింది…
ఈ సందర్భంగా భీంగల్ ఎస్సై తిరుపతి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు.

























