రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: పొంగులేటి…
తెలంగాణ : రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో దశల వారీగా తహశీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భవనాల నిర్మాణాలపై మంగళవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. తొలి విడతలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107 తహశీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో ఆఫీస్ల నిర్మాణానికి రూ.263 కోట్లతో, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రూ.97 కోట్లతో పలు ఆఫీస్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.























