Homeతెలంగాణజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి...

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

– అర్హులైన ప్రతిఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీచేయాలి 

– జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి

— టి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన.

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ 

నిజామాబాద్ జిల్లాతో పాటు మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) ప్రతినిధులు డిమాండ్ చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జర్నలిస్టులు కృషిచేస్తున్నారని తెలిపారు. ఎండనక, వాననక విధుల్లో ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడారు. ఉద్యమం సందర్భంగా, ఆ తరువాత కూడా వందలాది మంది చనిపోయారు. పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వాల విధానాలు మారిపోతున్నాయి. కానీ, జర్నలిస్టుల బతుకుల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను యూనియన్ గవర్నమెంట్ కోడ్ల కింద మార్చేసి హక్కులను కాలరాసింది. కార్మిక చట్టాలను తుంగలో తొక్కింది. అటు యూనియన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందడం లేదు. చివరకు వృత్తి నిర్వహణకు కావాల్సిన అక్రిడిటేషన్ కార్డులు సైతం సకాలంలో ఇవ్వడం లేదు. అనేక ఉద్యమాల ఫలితంగా గత రెండు నెలల నుంచి అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తున్నారు. అర్హులైన వారందరికి ఇవ్వాలనేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీచేయాలి. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకూ కార్డు ఇవ్వాలి. ఒకే యూనియన్ నుంచి ప్రాతినిథ్యం వహించే వారిని అక్రిడిటేషన్ కమిటీల నుంచి తొలగించాలి. అందరికి సమాన ప్రాతినిథ్యం కల్పించాలి. జర్నరలిస్టులకు న్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నరలిస్టుకూ హెల్త్కేర్డులివ్వాలి. కంట్రిబూషన్ ను ప్రభుత్వమే జర్నలిస్టుల తరపున చెల్లించాలి. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇండ్లస్థలాలు వెంటనే ఇవ్వాలి. యుద్ధప్రాతిపదికన ప్రక్రియకు శ్రీకారం చుట్టి జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం మోడీ సర్కార్పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, లక్ష్మణ్, తిరుపతిలతో పాటు కమ్మర్పల్లి మండల గాండీవం దినపత్రిక రిపోర్టర్ కొలిప్యాక బొర్రయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!