ధర్పల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ
గురువారం : 02/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభనిర్వహించారు.ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాస్ హాజరయ్యారు.. పంచాయతీ కార్యదర్శి మేళ్ళ శ్రీనివాస్ గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాలు చదివి వినిపించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























