ప్రతి ఈఎస్‌ఐ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి: మంత్రి వివేక్!
తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐ సేవలను విస్తరించాలని, ప్రతి ఈఎస్‌ఐ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. రామగుండంలో 100 పడకల ఆసుపత్రి, వరంగల్‌లో మరో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, రద్దయిన 15 డిస్పెన్సరీలను మంజూరు చేయాలని కోరారు.























