ఇస్రోలో సైంటిస్టుల రాజీనామాలు.. గగన్‌యాన్‌పై ఆంక్షలు…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో కీలక మిషన్లకు సంబంధించిన సైంటిస్టుల వరుస రాజీనామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గగన్‌యాన్ వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సైంటిస్టుల స్వచ్ఛంద పదవీ విరమణ (VRS), రాజీనామాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ అంతరిక్ష శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 14న విడుదలైన అంతర్గత మెమో ప్రకారం.. గగన్‌యాన్ సహా కీలక జాతీయ మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది సమర్పించే రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను ఇకపై సాధారణంగా ఆమోదించరాదని ఆదేశించింది.























