కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు…
తెలంగాణ : కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, NDSAకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఓ లాయర్ పిటిషన్ వేశారు. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను NDSA రిపోర్ట్ ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై NDSA దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని లాయర్ వాదనలు వినిపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల రక్షణపై వివరణ ఇవ్వాలని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.























