Homeకమ్మర్‌పల్లి మండల్కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్,స్పీకర్ విరాళం...

కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్,స్పీకర్ విరాళం…

కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్,స్పీకర్ విరాళం…

త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ 

కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల (PTM) సమావేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ పిల్లల విద్యాభివృద్ధి, హాజరు, క్రమశిక్షణ, ఆరోగ్యం, భవిష్యత్ లక్ష్యాలు మరియు వ్యక్తిత్వ వికాసంపై ఉపాధ్యాయులతో చర్చించారు.

సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు వివరించి, ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందించారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరు కావడం, ఇంటి వద్ద చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించడం, పుస్తక పఠన అలవాటు పెంపొందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు మరియు ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. *కోనాపూర్ గ్రామ నివాసి బోదాసు బాలయ్య రూపాయలు 20,000 విలువైన మ్యూజిక్ సిస్టం,స్పీకర్,మైక్ సెట్* విరాళంగా అందచేశారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు ప్రతిరోజు పాఠశాలకు పంపుతామని , ఏదైనా కారణంతో రాలేకపోతే ఉపాధ్యాయులకు తెలియజేస్తామని, ప్రతిరోజు పిల్లలను పాఠశాల ఏం జరిగిందో తెలుసుకుంటామని, విద్యాసంస్థల పాఠశాల జరిగే ప్రతి సమావేశానికి హాజరై పిల్లల చదువు మరియు ఉన్నతి పై చర్చిస్తామని , విద్యార్థుల సమస్యలపై పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో వ్యక్తిగతంగా చర్చిస్తామని ప్రతిజ్ఞ చేశారు .పాఠశాల అభివృద్ధికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల–తల్లిదండ్రుల మధ్య నిరంతర సమన్వయం అవసరమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్, సర్పంచి రిక్కల అరుణ్ రెడ్డి ,కమ్మర్పల్లి మండలం క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!