బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 8 మంది మృతి!
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. లైసెన్స్ రద్దు అయినప్పటికీ ఈ యూనిట్ ను నడిపినట్లు తెలుస్తోంది. కాగా సమాచారం మేరకు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.























