ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిపుణుల కమిటీ ఏర్పాటు…
తెలంగాణ : ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ‘రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జి.చెన్నారెడ్డి, కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ నియమితులయ్యారు. వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, రాష్ట్రం నుండి గ్రామ స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం, కరువు నివారణ చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం.























