మహిళా శక్తితోనే తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి…
తెలంగాణ : 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన FLO సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. శిల్పారామం వద్ద మహిళా శక్తి బజార్ కోసం స్థలం కేటాయించామని, ఫిక్కీ ఆఫీస్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఎకరం స్థలం ఇస్తామని ప్రకటించారు. మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానిస్తామని, సౌర విద్యుత్ ఉత్పత్తి, స్కూల్ యూనిఫారాల బాధ్యతలను మహిళలకే అప్పగించామని సీఎం తెలిపారు.























