హరితహారంలో భాగంగా సీతాయిపేటలో మొక్కల నాటడం.
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం సీతాయిపేట గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం గ్రామ సర్పంచ్ చెప్యాల భూమేష్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భూమేష్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కలను పెంచడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రకాంత్, కానిస్టేబుల్ రవీందర్, సంతోష్, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























