తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు మంగళవారం కూడా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.750 తగ్గి రూ.1,37,350కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.820 తగ్గి రూ.1,49,840 పలుకుతోంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.100 పెరగడంతో రూ.2,60,100 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.























