దాతల నుండి సేకరించిన విరాళాలను జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు కి అందచేసిన మెండోరా గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకు డెస్క్ బెంచీల కొరకు గ్రామంలోని దాతల నుండి గల్ఫ్ లోని గ్రామస్తుల నుండి సేకరించిన విరాళాలు 45700/- రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఏపీఓ నరసయ్య ,కాంగ్రెస్ నాయకులు చాకలి గంగాధర్, మెడికల్ సత్యం, వార్డు సభ్యులు బాజిరెడ్డి అభిలాష్, పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్ కారోబార్ భోజన్నా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.























