Homeఇందూరుపండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా...

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం పని చేయాలి..

* పార్టీ కండువా వేసుకోవాలంటే అదృష్టం ఉండాలి..

* ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు…

ఇందూరు: వ్యక్తుల కోసం కాకుండా బిజెపి జెండా కోసం పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇందూరు అర్బన్ ప్రశిక్షణా తరగతులు మంగళవారం విజయలక్ష్మి గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కండువా వేసుకోవాలంటే అదృష్టం ఉండాలని, ఈ అదృష్టం మనందరికీ కలగడం పూర్వజన్మ సుకృతం అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు. జాతీయ వాదం హిందువుల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రధానంగా ఆత్మనిర్బర్ భారత్ ను ప్రారంభించి” వోకల్ ఫర్ లోకల్ ” అనే నినాదంతో దేశాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా.. సాంకేతికంగా.. ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధిగా మార్చేందుకు తీసుకున్న ముఖ్య కార్యక్రమం అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను పెంచుకోవడం స్థానిక పరిశ్రమలను అభివృద్ధి చేయడం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం అన్నారు. ఆత్మనిర్బార్ భారత్ ద్వారా దేశ ఆర్థికంగా బలపడుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ప్రపంచంలో భారత దేశ స్థానం మరింత మెరుగవుతుందని వివరించారు. * 2014 ముందు కేవలం 16 ఐఐటీలు ఉంటే ప్రస్తుతం 23 కు పెరిగాయని అలాగే 7 AIMS హాస్పిటల్స్ ఉంటే ప్రస్తుతం 25 కు పెరిగాయని గుర్తు చేశారు. 60 ఏళ్లలో చేసిన అభివృద్ధికి రెట్టింపుగా ప్రధాని మోదీ ఈ 12 సంవత్సరాలలో చేశారన్నారు. “మేక్ ఇన్ ఇండియా” దిశగా అడుగులు వేస్తూ దేశాభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. * పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పని చేసినా ఎప్పటికప్పుడు ప్రశిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. శిక్షణలో వివరించే అనేక అంశాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పార్టీలో ప్రతి సంవత్సరం శిక్షణ తరగతులు ఉంటాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా అంశాలపై నిష్ణాతులు, రాష్ట్ర స్థాయి శిక్షణ పొందిన వారు విపులంగా తరగతులు చెప్పడం జరుగుతుందన్నారు. కావున ప్రతి కార్యకర్త ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, అర్బన్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!