వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించాలి: సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
మెండోరా గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ అధ్యక్షతన,గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక అధికారి ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సమావేశమై వీబీజీ రాంజీ ఉపాధి హామీ పథకం లో జలసిరి లో నిర్వహించాల్సిన పనులపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ లక్ష్మి రమేష్ మాట్లాడుతూ,ప్రస్తుతం రాష్ట్రంలో వర్షబావ పరిస్థితి తులు ఉన్నందు వలన వాటిని ఎదుర్కొనేందుకు ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు వీటి ద్వారా బోరుబావుల రీఛార్జ్ అయ్యి నీటి కొరత రాకుండా జాగ్రత్త పడవచ్చఅని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ.. పంట పొలాల్లో బోరు బావులు ఎండిపోకుండా ఉండటానికి వీబీజీ రాంజీ పథకంలో పంట కుంటలను ఏర్పాటు చేసుకోవాలని,అలాగే ఇంట్లోని పనికిరాని చెత్తను తడి, పొడి చెత్తలుగా వేర్వేరుగా చేసి చెత్త బండిలో వేయాలని సూచించారు. కార్యక్రమం లో వార్డు సభ్యులు బాజిరెడ్డి అభిలాష్, షేఫీ, ఎల్లయ్య, కోమిరే బూమేష్, చింతకింది సునీత,కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్, చాకలి గంగాధర్ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ భోజన్న మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
























