Homeత్రిశూల్ న్యూస్రాజకీయ పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం సంసిద్ధులవ్వాలి

రాజకీయ పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం సంసిద్ధులవ్వాలి

*హనుమాన్ జంక్షన్ లోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ*

ఇందూరు అర్బన్.. హిందూ ధర్మం కాపాడడం కోసం హిందూ సైన్యమంతా ఏకమై మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉందని అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ  పేర్కొన్నారు. హిందువులు వారి వారి ఇష్టానుసారంగా వివిధ పార్టీలలో ఉన్నప్పటికీ వారి అంతిమ లక్ష్యం మాత్రం హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా ఉండాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఒకప్పుడు ఇందూరులోని వినాయక్ నగర్ లో ప్రత్యేకంగా ఏర్పడిన ఈ హనుమాన్ ఆలయం వల్ల ఈ ప్రాంతం హనుమాన్ జంక్షన్ గా పిలువ పడుతుందని అన్నారు. అది ఈ ఆలయానికి ఉన్న గొప్పతనం అని పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడి ప్రాంత వాసులు ముందుకు వచ్చి ఒక్కొక్కరి వద్ద చెందాలు జమ చేసి 54 ఫీట్ల భారీ హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారని ఇది ఇందూరుకే గర్వ కారణమని కొనియాడారు. నిజామాబాద్ లోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అఖిలభారత హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ మంగళ శాసనములతో హనుమాన్ దీక్ష స్వాములకు ప్రతినిత్యం బిక్ష (అన్నదాన ప్రసాదం) చేయబడుతుందన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులకు ఎమ్మెల్యే  తన స్వ హస్తాలతో భోజనాన్ని వడ్డించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!