* నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ తెలియజేయునది సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారంగా ఏమనగా కామ దహనము మరియు హోలీ పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలో గల కళ్ళు దుకాణాలు , కల్లు డిపోలు , ఐ.ఎమ్.ఎల్ (ఎ4) షాప్స్ / 2-బి బార్స్ / క్లబ్బులు / టిడి-1 మరియు సిఎస్ -2 మొదలగునవి తేదీ: 03-3-2026 సాయంత్రం 6 గంటల నుండి తేది : 05-3-2026 ఉదయం 6 గంటల వరకు మూసి వేయబడును.























