అభ్యాసనానికి చేయూత…
ప్రాథమిక స్థాయిలో రెమిడీయేషన్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కేంద్రంలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల అభ్యాసన లోపాలను గుర్తించి నివారణకు ప్రత్యేక కార్యచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి ఏ విధంగా అమలు చేసుకోవాలి అని మండల ప్రాథమిక ఉపాధ్యాయులందరికీ రెండు విడతలుగా 50% తేది 20/07/2026 నుండి 22/07/2026 వరకు ఉపాధ్యాయులకు మూడు రోజులు మరొక 50% ఉపాధ్యాయులకు 23/07/2026 నుండి 27/07/2026 వరకు మూడు రోజులు zphs కమ్మర్పల్లి పాఠశాలలో శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ నేర ఆంధ్రయ్య మాట్లాడుతూ,,పిల్లల అభ్యాసన స్థాయిలను గుర్తించుకొని వాటికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకొని మన పాఠశాల బోధనలో అమలు చేస్తూ విద్యార్థుల అభ్యసన లోపాలను నివారించి విద్యార్థులందరికీ తెలుగులో మరియు ఆంగ్లంలో చదవడం రాయడం గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయడం నేర్పించి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఈ ముగింపు కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆంద్రయ్య ,కాంప్లెక్ ప్రధానోపాధ్యా సాయన్న పాల్గొన్నారు.మండల రిసోర్స్ పర్సన్స్ గా శిక్షణ ఇచ్చిన పసుపుల ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్,మరియు కోర్బన్ లను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య గారు సన్మానించడం జరిగింది. మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

























