ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలపై అవగాహన…
రైతుల ముంగిటకు నాణ్యమైన విత్తనాలు.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సోమవారం చేంగల్ రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చేంగల్ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ రైతులకు ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితులను వివరించారు. తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగు, నాణ్యమైన ధృవీకరించిన విత్తనాల వినియోగం, పంటల ఎంపికపై రైతులకు సూచనలు చేశారు.
హార్టికల్చర్ అధికారి రోహిత్ ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు.
విడిసి ఛైర్మన్ నేతికుంట గంగాధర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ శాఖలు సూచిస్తున్న నాణ్యమైన విత్తనాలనే వినియోగించి మెరుగైన దిగుబడులు సాధించాలని కోరారు.
ఈ విత్తన మేళాలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ పంటల విత్తనాల గురించి వివరాలు తెలుసుకొని, సాగు సలహాలను పొందారు. కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

























