కోనసముందర్ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం- పాల్గొన్న పంచాయతీ పాలక వర్గం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

ప్రతీ ఏటా వర్షాకాల సమయంలో ప్రభుత్వం నిర్వహించే వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామంలో TGb బ్యాంకు వెళ్లే దారిలో రోడ్డు కి ఇరువైపుల సర్పంచ్ బెజ్జారం రాకేష్, ఉప సర్పంచ్, బాలేరావ్ శంకర్,వార్డ్ మెంబర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ గోపాల్,సి ఏ, మహిళా సమైఖ్య సంఘం సభ్యులు కలసి మొక్కలను నాటరు. అనంతరం ఇంటింటికి చెట్ల పంపిణీ చేస్తూ చెట్లు నాటడం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. వన సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని గుర్తు చేశారు.

























