ఉప్లూర్ గ్రామంలో జల సంరక్షణ, నీటి నిల్వపై గ్రామ సభ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో జలసంరక్షణ వర్షపు నీటి నిల్వ మరియు భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ (Soak Pits) లేదా మ్యాజిక్ సోక్ పిట్స్ (Magic Soak Pits) నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని వివరించారు.
అలాగే రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఊట గుంటలు (Farm Ponds) మరియు కమ్యూనిటీ ఊట గుంటలు నిర్మించాలని సూచించారు.
భూగర్భ జలాల పెంపుదలకు బోరుబావుల వద్ద రీఛార్జ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, ఈ చర్యల ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ గ్రామ సభలో APO విద్యానంద్,కార్యదర్శి సౌందర్య, ఉప సర్పంచ్ తక్కురి ముత్యం,వార్డ్ సభ్యులు అజయ్,సురేష్, సీసీ నవీన్, అంగన్ వాడి టీచర్లు,విఏవో లు,ఏఎన్ఎం,ఆశ వర్కర్లు,నాయకులు ఆకుల శేఖర్, అవారి సంతోష్ గ్రామ ప్రజలు, రైతులు,వార్డు సభ్యులు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

























