కోనాసముంధర్ గ్రామంలో మహిళా సంఘాలతో జనరల్ బాడీ సమావేశం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో కోనాసముందర్ గ్రామంలో మహిళ సమైక్య సంఘం సి సి రవి ఆధ్వర్యంలోజనరల్ బాడీ సమావేశం నిర్వహించారు .

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐకెపి సంఘం అధ్యక్షులు కుంట గంగారెడ్డి ,గ్రామ సర్పంచ్ బెజ్జారాపు రాకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, మహిళల అభివృద్ధే గ్రామ అభివృద్ధికై తోడ్పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు లో భాగంగా పెట్రోల్ బంకులు,ఉచిత బస్సు,పావలా వడ్డీ రుణాలు,శ్రీనిధి ద్వారా పది లక్షలు ప్రమాద బీమా వంటి పథకాలు నిర్వహించడం జరిగిందన్నారు.

అలాగే సర్పంచ్ రాకేష్ మాట్లాడుతూ,, ప్రభుత్వం చేపడుతున్న పెన్షన్ కు అర్హులైన వారు గ్రామపంచాయతీలో తమ కు దరఖాస్తు అందజేయాలని కోరారు. పెన్షన్ కోసం గ్రామంలో ఎవరి దగ్గరికి తిరిగివద్దని , ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దని,నేరుగా తమ ని సంప్రదించాలని మహిళలకు సూచించారు. అనంతరం శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి మాట్లాడుతూ శ్రీనిధి రుణాలు అతి తక్కువ వడ్డీతో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జీవను ఉపాధి ద్వారా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తద్వారా కుటుంబ జీవనాన్ని పోషించుకోవాలని కోరారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా శ్రీనిధి రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. శ్రీనిధి ద్వారా ఆటో, స్కూటీ, సోలార్ విద్యుత్ ,మదర్ యూనిట్ ,నాటు కోళ్ల పెంపకం , పాల కేంద్రాలు ,పిండి వంటకాల తయారీ,టెంట్ హౌస్, ఐశ్వర్య ,సౌభాగ్య రుణాలు ఐదు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఏపిఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ,, ప్రతి మహిళ కోటీశ్వరులను చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మహిళలకు ప్రభుత్వ అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి వర్తింప చేస్తామన్నారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు . రెండు వివో ల అధ్యక్షులుగా పోతనక మౌనిక ,ఆది గంగా నర్సు లు ,ఉపాధ్యక్షులుగా అలా కొండ శ్యామల, కొండ వరలక్ష్మి. కార్యదర్శిగా భోగంసారిక, మేకల లక్ష్మి. కోశాధికారిగా దాసరి కమల, మల్లెల సాయమ్మ ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గానికి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నస్రేన్ బేగం,వివో ఏ లు నయనా.,దుంపల లత,బాలమణి,కొలిప్యాక రాఘవి, గోపు మేఘన, మహిళా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

























