Homeకామారెడ్డినేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన...

నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన…

నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన…

ప్రేమ పేరుతో మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై కళాబృందం ప్రదర్శనలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

రామారెడ్డి: రెడ్దిపేట గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామారెడ్డి ఎస్‌ఐ మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని ఎస్‌ఐ మురళి సూచించారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం అందించవద్దని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.

అలాగే మూఢనమ్మకాలను నమ్మకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బంది వివరించారు.

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పీసీ. ప్రభాకర్, యు. సాయిలు మాటలు, పాటలు, కళారూపాల ద్వారా విద్యార్థులకు నేరాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  గోపాలరెడ్డి ఉపాధ్యాయులు బద్రి విద్యార్థులు పాల్గొన్నారు. నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

0
జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... శ్రీ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు జంగంపల్లి: కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలోని...

రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ…

0
రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ... రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్...

ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో...

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి...

హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల…

0
“హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల” *ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను నిండా ముంచిన రేవంత్ సర్కార్* *కాంగ్రెస్ ఇచ్చిన ‘గ్యారెంటీ కార్డు మోసపూరితం* *మోర్తాడ్ వేదికగా...

Translate »
error: Content is protected !!