Homeతెలంగాణకాంగ్రెస్ విఫల పాలనను ప్రజల్లో ఎండగడతాం: బిగాల గణేష్

కాంగ్రెస్ విఫల పాలనను ప్రజల్లో ఎండగడతాం: బిగాల గణేష్

కాంగ్రెస్ విఫల పాలనను ప్రజల్లో ఎండగడతాం: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల…

నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకులు శ్రీ గణేష్ బిగాల విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బడ్జెట్, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రూ.2,000 పెన్షన్‌ను రూ.4,000 చేస్తామని, ఇంట్లో ఇద్దరికి ఇస్తామని ఆశ చూపి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.

గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో రైతులను, పేద ప్రజలను ఆదుకున్న ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ విఫల పాలనపై శాంతియుతంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 420 హామీల ఫ్లెక్సీల ప్రదర్శన, ధర్నాలు, బైక్ ర్యాలీలు, నిరసనలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీష్ రెడ్డి మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజాత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు, ప్రభుత్వం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ వైఫల్యాలను గమనిస్తున్న ప్రజలు మరియు ఇతర పార్టీల నాయకులు బిఆర్ఎస్ వైపు వస్తున్నారని, ప్రతినిత్యం భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు,NUDA మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్,నవీద్ ఇక్బాల్,అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్…

0
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి వాహనాల వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: నిజామాబాద్...

ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన వాగ్దేవి పాఠశాలలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో...

మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ…

0
మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ సఖి వన్ స్టాప్ సెంటర్ పోస్టర్‌, పాంప్లెట్లను ఆవిష్కరించిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళల హక్కుల పరిరక్షణకు, గృహహింస...

ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ…

0
ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ PM SHRI పథకంలో భాగంగా విద్యార్థులకు నిఘంటువుల అందజేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని తెలంగాణ ఆదర్శ...

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా…

0
ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

Translate »
error: Content is protected !!