Homeతెలంగాణకాంగ్రెస్ విఫల పాలనను ప్రజల్లో ఎండగడతాం: బిగాల గణేష్

కాంగ్రెస్ విఫల పాలనను ప్రజల్లో ఎండగడతాం: బిగాల గణేష్

కాంగ్రెస్ విఫల పాలనను ప్రజల్లో ఎండగడతాం: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల…

నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకులు శ్రీ గణేష్ బిగాల విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బడ్జెట్, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రూ.2,000 పెన్షన్‌ను రూ.4,000 చేస్తామని, ఇంట్లో ఇద్దరికి ఇస్తామని ఆశ చూపి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.

గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో రైతులను, పేద ప్రజలను ఆదుకున్న ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ విఫల పాలనపై శాంతియుతంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 420 హామీల ఫ్లెక్సీల ప్రదర్శన, ధర్నాలు, బైక్ ర్యాలీలు, నిరసనలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీష్ రెడ్డి మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజాత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు, ప్రభుత్వం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ వైఫల్యాలను గమనిస్తున్న ప్రజలు మరియు ఇతర పార్టీల నాయకులు బిఆర్ఎస్ వైపు వస్తున్నారని, ప్రతినిత్యం భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు,NUDA మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్,నవీద్ ఇక్బాల్,అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్…

0
గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల...

సమాజానికి సోషల్ వర్కర్ల అవసరం ఎంతో ఉంది..

0
సమాజానికి సోషల్ వర్కర్ల అవసరం ఎంతో ఉంది.. సోషల్ మీడియా ప్రభావంతో కొత్త తరహా మానసిక సమస్యలు.. పరిష్కారానికి సోషల్ వర్కర్లు అవసరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... ప్రస్తుత సమాజంలో సోషల్ వర్కర్ల అవసరం...

తాత మధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్…

0
తాత మధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్, సెప్టెంబర్ 7: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా...

నిజామాబాద్ లో బిఆర్ఎస్ భారీ ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం పై గణేష్ బిగాల ఆగ్రహం

0
కాంగ్రెస్ ప్రభుత్వ రౌడీయిజం, నిరంకుశ పాలనపై మండిపడ్డ గణేష్ బిగాల... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులను నిరసిస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా... నిజామాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం...

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలి: గణేష్ బిగాల…

0
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలి: గణేష్ బిగాల... నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని నిజామాబాద్...

Translate »
error: Content is protected !!