ఉప్లూర్ గ్రామంలో రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్ బాసవేణుగోపాల్ యాదవ్, ఉప్పలూరు గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉపసర్పంచ్ తక్కూరి ముత్యం, పంచాయతీ కార్యదర్శి సౌందర్య, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఎనడ్ల గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేంద్ర, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నజీర్, సాధుల్లా, రాజేశ్వర్, గౌడ్ బండి అంజనేయులు, ఇబ్రాహీం, దినేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉప్పలూరు గ్రామానికి నూతనంగా రెండు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలో సహకరించిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్కు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు, గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని ఉప్పలూరు గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

























