Homeతెలంగాణడ్రగ్స్ రహిత సమాజం కొరకు అందరూ పాటుపడాలి...

డ్రగ్స్ రహిత సమాజం కొరకు అందరూ పాటుపడాలి…

డ్రగ్స్ రహిత సమాజం కొరకు అందరూ పాటుపడాలి…

 రేపటి సమాజం మీదే.. మీరే నడుం బిగించాలి…

మత్తు పదార్థాల ను నిర్మూలించడం విద్యార్థులకే సాధ్యం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్

నందిపేట్ సెప్టెంబర్ 8 త్రిశూల్ న్యూస్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర పద్మశాలి కళ్యాణ మండపంలో సోమవారం జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో మండల కేంద్ర విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాలను కళ్ళకు కట్టినట్టు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ… దేశానికి యువత యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. ఈగల్ టీం అడ్వైజర్ కొండవీటి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ…. నేటి సమాజంలో మత్తు పదార్థాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని మరీ ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మత్తు పదార్థాలు ఉబిలో చిక్కుకొని యువత తన బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయని, విద్యార్థులను చైతన్య పరుస్తేనే డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం అవుతుందని, అందుకు విద్యార్థులంతా ఈ డ్రగ్స్ మహమ్మారి అంతానికి చేతులు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ… ఈగల్ టీం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చక్కటి కార్యక్రమానికి మండల కేంద్ర విద్యార్థులంతా రావడం చాలా సంతోషమని డ్రగ్స్ రహిత సమాజం కొరకు ముఖ్య పాత్రగా పోలీసులు కృషి చేస్తున్నారని, కానీ మత్తు పదార్థాల మహమ్మారిని అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని మరీ ముఖ్యంగా విద్యార్థులు ముందు వరుసలో నిలబడాలని, అప్పుడే నేటి సమాజానికి రేపటి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయచ్చని తెలిపారు. ప్రతిరోజు ఎన్నో సమస్యలను చూస్తుంటామని, వాటిని పరిష్కరిస్తుంటామని, కానీ మత్తు పదార్థాల కు విద్యార్థులు బానిసలై నేరాల బాటలు పడుతూ… ఉజ్వలమైన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నప్పుడు, అటువంటి సమస్యలను చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుందని, దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, ప్రతి విద్యార్థి తమతమ కుటుంబ సమస్యలను గుర్తెరిగి చెడు స్నేహాలను దూరం పెడుతూ, చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రమశిక్షణతో మంచి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు పరిగెడుతున్న సమయంలో మనం కూడా పరుగెట్టాల్సిందేనని, ఈ పరుగులో విద్యతోపాటు మంచిక్రమశిక్షణ ఉన్నప్పుడే ఉన్నతమైన లక్ష్యాలను ఛేదించవచ్చని తెలిపారు. ఈగల్ టీం సభ్యులు, మండల కేంద్ర పాఠశాలల ఉపాధ్యాయులు, గీత కాన్వెంట్, కృష్ణవేణి, సిద్ధార్థ, నవోదయ, ఉజ్వల, సూర్యోదయ, అక్షర, ప్రభుత్వ ఇంగ్లీష్, తెలుగు,ఉర్దూ మీడియాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

Translate »
error: Content is protected !!