కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, భాష, సంస్కృతి కోసం కాళోజీ నారాయణరావు చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కాళోజీ చూపిన బాటలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు షేరు, కాళ్ల గణేష్, యూనుస్, ప్రభాకర్, లక్ష్మణ్, TPO దేవరాజు, RO గోపాల్ రెడ్డి, AE వేణు ప్రసాద్, భాగ్యలక్ష్మి, మల్లికార్జున్, సాయి కిరణ్, నవీన్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

























