ధర్పల్లిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన మహిళలకు కార్డులు అందజేసిన సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్..
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన మహిళలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యులు మంచిగంటి ప్రసాద్, అజయ్, రాజ్ కుమార్, చక్రపాణి, రేషన్ డీలర్లు బాలే శంకర్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.

























