స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్న దళిత నాయకుడిని బి ఆర్ ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని నిరసిస్తూ భీమ్‌గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
శాసనసభలోకి నల్ల టీ-షర్టులు ధరించి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించడమే కాకుండా, స్పీకర్‌ను బూతులు తిడుతూ తీవ్రంగా దూషించడం క్షమించరాని నేరమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ నాయకుడు తాతా మధు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయామనే అహంకారం, నిరాశా నిస్పృహలతోనే బి ఆర్ ఎస్ నాయకులు ఇటువంటి అనాగరికమైన భాషను ఉపయోగించారని ఆరోపించారు.
అత్యున్నత రాజ్యాంగ పీఠంపై దళిత బిడ్డ ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా ప్రవర్తించడం దేశవ్యాప్తంగా ఉన్న దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసిందన్నారు. గత 1000 రోజులుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ కూడా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.రాబోయే ఎన్నికల్లో దళితులు, తెలంగాణ ప్రజలు బి ఆర్ ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ లత నర్సయ్య,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అనంత్ రావు,మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్,వివిధ గ్రామాల సర్పంచులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























