అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు..
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లి మండల బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
మంగళవారం ధర్పల్లి మండల కేంద్రంలోని దళితవాడలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హనుమంత రెడ్డి, ఎం. నరేందర్, సితాయిపేట్ సర్పంచ్ సీహెచ్ భూమేష్, శేఖర్ రెడ్డి, నజీర్, మజీద్, చంద్రకాంత్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























