బైక్ ప్రమాదంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేటర్ మృతి….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
డొంకేశ్వర్ సెప్టెంబర్ 8 త్రిశూల్ న్యూస్: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగ సముందర్ గ్రామానికి చెందిన 45 సంవత్సరాల మీర ఊషన్న తన సైకిల్ మోటార్ ఏపీ 01 ఏఇ1309 పైనుండి ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఊషన్న గత 8 నెలల నుండి మరంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ లో విధులు నిర్వహిస్తున్నాడని, రోజులాగే సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 5 గంటల కు తన మోటార్ సైకిల్ పై డ్యూటీకి వెళ్లి 7 తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా లిఫ్ట్ రోడ్ గుట్ట ప్రాంతంలో అడవి పంది అకస్మాత్తుగా అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడ్డ ఉషన్నకు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని, మృతుని మేనల్లుడు మీర అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపరాదని హెల్మెట్ మన ప్రాణాన్ని రక్షిస్తుందని, ప్రమాద తీవ్రతను తగ్గిస్తుందని అందుకే కుటుంబ సభ్యుల కొరకైనా ప్రతి ఒక్కరూ హెల్మెట్లను వాడాలని విజ్ఞప్తి చేశారు.























