పతంజలి యోగా సెంటర్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు
ప్రతి నెలా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం: డాక్టర్ హరినాథ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్‌లో నిర్వహిస్తున్న పతంజలి యోగా సెంటర్‌లో సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
డాక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో సభ్యులకు బీపీ, షుగర్, బరువు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. యోగా, క్రమబద్ధమైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
అలాగే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పాలు తదితర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
గత రెండు సంవత్సరాలుగా పతంజలి యోగా సెంటర్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇకపై కూడా ప్రతి నెలా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ హరినాథ్ తెలిపారు.
ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తున్న డాక్టర్ హరినాథ్‌ను పతంజలి యోగా సెంటర్ సభ్యులు ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో యోగా గురువు అంతిరెడ్డి వెంకటస్వామి, వెంకటరాజం, శ్రీహరి, మల్లారెడ్డి, లింగంచారి, అధ్యక్షుడు కృష్ణమూర్తి, భారతి, లావణ్యతో పాటు పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు.

























