చేయూత పింఛన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ పరిశీలించిన కమిషనర్.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్, సెప్టెంబర్ 16: భీమ్‌గల్ పురపాలక సంఘం పరిధిలో నూతనంగా చేయూత పథకం కింద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియను కమిషనర్ పరిశీలించి, దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా వివరాలను పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

























