మెంట్రాజ్పల్లిలో ఘనంగా ఊర పండగ
గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు.. భక్తిశ్రద్ధలతో వేడుకలు…
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ దేవతల ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి, పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
గ్రామంలోని అన్ని కులాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను ప్రార్థించారు. ఊర పండగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

























