ముల్లంగి వీవో పరిధిలో ‘అమ్మకు అక్షరమాల’ పరీక్షా కేంద్రం సందర్శన.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామ వీవో పరిధిలో నిర్వహిస్తున్న ‘అమ్మకు అక్షరమాల (ఉల్లాస్)’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ అశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అశ్వంత్ సందర్శించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. పరీక్షకు హాజరైన మహిళలతో మాట్లాడి వారిని అభినందించారు.
‘అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదవడం, రాయడం నేర్చుకోవడం ద్వారా జీవితంలో కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు. మహిళలు అక్షరాస్యులుగా మారి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, కుటుంబం, సమాజ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలి’ అని కార్యక్రమంలో సందేశం ఇచ్చారు.
అనంతరం ఏపీఎం రవీందర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీసీ సురేష్, వీఓఏలు సౌజన్య, శ్రీలత, వీఓ అధ్యక్షురాలు బులక్ష్మి, ఎస్‌బీకేలు పాల్గొన్నారు.

























