అనారోగ్యంతో బాధపడుతున్న బద్దం గంగారం పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ భీమ్గల్ మండలంలోని చేంగల్ గ్రామానికి చెందిన బద్దం గంగారం పరామర్శించారు.
గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ కార్యకర్త బద్దం గంగారం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ పసుఫు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ బాల్కొండ నియోజక వర్గం ఇంచార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి కలసి వారి ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ఇ కార్యక్రమంలో భీమ్ గల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, చెంగల్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్,సీనియర్ నాయకులు మూలిగే మహిపాల్,బద్దం సుజీత్,కొట్టాల అశోక్, పుప్పాల దినేష్, నీకేష్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

























