Homeడిచ్ పల్లి మండల్నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు...

నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు…

నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు

రూ.92 లక్షలతో రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.. 150 లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి పేర్కొన్నారు.

డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై రూ.92 లక్షల వ్యయంతో రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి లైటింగ్‌ను ప్రారంభించారు.

లైటింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన రహదారి వెంబడి ఏర్పాటు చేసిన 150 సెంట్రల్ లైట్లు వెలిగి విద్యుత్ కాంతులను విరజిమ్మాయి. దీంతో నడిపల్లి ప్రధాన రహదారి వెలుగులతో నిండిపోయింది. రాత్రివేళల్లో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు అందడంతో పాటు రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల్లో మెరుగైన వసతులు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

నడిపల్లి ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు…

0
గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించిన వైద్యులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్...

ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం…

0
ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్ నిజామాబాద్ జిల్లా: ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్న...

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్…

0
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి వాహనాల వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: నిజామాబాద్...

ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన వాగ్దేవి పాఠశాలలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో...

మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ…

0
మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ సఖి వన్ స్టాప్ సెంటర్ పోస్టర్‌, పాంప్లెట్లను ఆవిష్కరించిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళల హక్కుల పరిరక్షణకు, గృహహింస...

Translate »
error: Content is protected !!