ధర్పల్లిలో రామారావు మహారాజ్ 6వ వర్ధంతి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రామారావు మహారాజ్ 6వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహం వద్ద బంజారా సోదరులు భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని తండాలకు చెందిన నాయక్ కార్బారీలు, పెద్దమనుషులు, తండా పూజారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, తండా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంప్రదాయ ఆచారాల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించి రామారావు మహారాజ్‌కు నివాళులర్పించారు. బంజారా సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ మండల అధ్యక్షులు మంగిత్యా నాయక్, లాల్ సింగ్, ధర్పల్లి మండల కార్యవర్గ సభ్యులు, బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు.

























