జనసేనలో చేరిన గుడిపాటి సీతారామ్…
విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు.
మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సీతారామ్ కలసి పార్టీలో చేరుతానని కోరారు. పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో సీతారామ్ సతీమణి, యువ గాయని లలిత పాల్గొన్నారు.
‘నేషన్ ఫస్ట్ అనే దృక్పథం కలిగిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరాను. పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను’ అని ఆయన చెప్పారు…..

























